ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
short by
Sri Krishna /
07:40 am on
21 Dec