తిరుమలలో దైవ దర్శనం కోసం వచ్చేవారికి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తెలంగాణ నేతల లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసినా, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. సిఫార్సులతో వెళ్లిన భక్తులను అనుమతించకపోవడంపై గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.
short by
Bikshapathi Macherla /
10:57 pm on
11 Mar