తెలుగు రాష్ట్రాల జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి బుధవారం దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో భేటీ కానున్నారు. 10 అంశాల ఎజెండాను జలశక్తి శాఖ సిద్ధం చేసింది. ప్రస్తుత దశలో ‘పోలవరం-బనకచర్ల’పై చర్చ అసంబద్ధమంటూ కేంద్రానికి తెలంగాణ తాజాగా లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ పోలవరం-బనకచర్ల అనుసంధానమే జలశక్తి ఎజెండాలో మొదటి అంశంగా ఉంది.
short by
/
08:17 am on
16 Jul