తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ఆధివారం భేటీ అయ్యారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన CM, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గంటకు పైగా జరిగిన ఈ భేటీలో కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు నివేదికలు తెలిపాయి. కాగా ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
short by
Devender Dapa /
11:07 pm on
30 Mar