తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక గడువు ముగిసేంత వరకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సోమవారమే బీజేపీకి రాజీనామా చేయడం గమనార్హం.
short by
Devender Dapa /
11:03 pm on
30 Jun