తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు స్థానం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గిరిజన సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధులు పార్లమెంటు ఆవరణలో రాహుల్‌గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. కాగా తెలంగాణ కేబినెట్‌లోని 6 ఖాళీల్లో నాలుగు నుంచి ఐదింటిని ఏప్రిల్ మొదటి వారంలోగా భర్తీ చేసే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
short by
Devender Dapa /
03:58 pm on
29 Mar