తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తంగా 11 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 97 గంటల 32 నిమిషాల పాటు సభ కొనసాగింది. వార్షిక బడ్జెట్ సహా 12 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 146 మంది సభ్యులు మాట్లాడారు. 16 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. డీలిమిటేషన్ సహా పలు తీర్మానాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడించింది.
short by
Bikshapathi Macherla /
10:04 pm on
27 Mar