తెలంగాణలో ఈ ఏడాది యాసంగిలో 127.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అందులో 70.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ ఇప్పటికే 7,337 చోట్ల కేంద్రాలు ప్రారంభించామన్నారు. కొనుగోలులో జాప్యం జరగొద్దని అధికారులను ఆదేశించారు.
short by
Devender Dapa /
10:37 pm on
19 Apr