తెలంగాణలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారులు గురువారం జారీ చేశారు. దీంతో 292 జడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ స్థానాలకు అక్టోబర్ 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 5 దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
short by
srikrishna /
12:26 pm on
09 Oct