‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకంలో భాగంగా తొలి విడతలో మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చూడాలని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.
short by
Srinu Muntha /
09:47 pm on
29 Jan