తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీయులకు వైద్య సేవలందించే హబ్‌గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.
short by
Devender Dapa /
11:34 pm on
28 Feb