తెలంగాణలో ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 10 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.4 డిగ్రీలు, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగా ఉండనున్నాయి.
short by
Devender Dapa /
10:32 pm on
20 Nov