తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ‘ఈనాడు’ పేర్కొంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కో పరీక్ష మధ్య 1-2 రోజుల వ్యవధి ఇవ్వాలని, దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోందని నివేదించింది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ 2-3 రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరీక్షల తేదీల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
short by
srikrishna /
04:59 pm on
26 Nov