తెలంగాణ వ్యాప్తంగా శనివారం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 42 వేలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 37 వేలకు పైగా జరిమానా విధించదగ్గ క్రిమినల్ కేసులు, 3,217 చెల్లని చెక్కుల కేసులు, 1,889 ఇతర కేసులు ఉన్నాయి. మొత్తం 42,063 కేసులు పరిష్కరించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. లోక్ అదాలత్‌లో పరిష్కారం కోసం 48,705 కేసులు సిఫారసు చేయగా 42,063 కేసులు పరిష్కారమయ్యాయన్నారు.
short by
Devender Dapa /
08:26 am on
16 Nov