చెల్లి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుండగా వరంగల్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఎర్ర అఖిల్ అనే 28 ఏళ్ల యువకుడు, అతడి స్నేహితుడు మృతి చెందారు. పోలీసుల ప్రకారం, ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా, వీరిద్దరూ బైక్‌పై హనుమకొండ వెళ్లేందుకు బయలుదేరారు. శుక్రవారం అర్ధరాత్రి దాటక వీరి బైక్‌ను వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినా అఖిల్ మృతితో అతడి చెల్లి వివాహం ఆగిపోయింది.
short by
Devender Dapa /
10:29 pm on
22 Feb