ప్రకాశం జిల్లా పొదిలిలో శుక్రవారం తెల్లవారుజామున 3.12 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైందని, భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ఏడాది మే 6న కూడా పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది.
short by
/
11:19 am on
05 Dec