తక్కువ కాలంలో రూ.1700 కోట్ల క్లబ్‌లో చేరిన ఇండియన్ సినిమాగా అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. 21 రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమాగా, హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప 2’ ఇప్పటికే రికార్డులు నెలకొల్పింది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు.
short by
Srinu Muntha /
05:52 pm on
26 Dec