పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో 19 ఏళ్ల అనూష తన పెళ్లిచూపుల రోజునే గడ్డి మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ యువతి పెళ్లి ఖర్చుల కోసం వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు ఇల్లు, కొద్దిపాటి భూమి అమ్మేందుకు సిద్ధపడ్డారు. తన పెళ్లి కోసం నీడ, ఆధారం కోల్పోవద్దని ఆమె తల్లిదండ్రులను గట్టిగా వారించింది. అయినప్పటికీ పెళ్లిచూపులకు ఏర్పాట్లు చేయడంతో అనూష ఆత్మహత్య చేసుకుంది.
short by
srikrishna /
01:28 pm on
23 Nov