తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో కారును లారీ ఢీకొనడంతో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను 24ఏళ్ల ఇల్లాకుల నవీన్, 26ఏళ్ల పైడి సాయిగా పోలీసులు గుర్తించారు. అయ్యప్ప మాల ధరించిన ఈ ఆరుగురు యువకులు శబరిమలై వెళ్లి అక్కడి నుంచి రామేశ్వరం దర్శించుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
short by
/
12:23 pm on
27 Nov