గుంటూరులో ప్రభుత్వాసుపత్రి వద్ద తన తల్లి నడిపే టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట తొలగించి, కాలువలో పడేశారని 8 ఏళ్ల యశ్వంత్ సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. జీవనోపాధి పోవడంతో అమ్మ చనిపోదామని అంటోందని చెప్పాడు. తనకు గుండె జబ్బు ఉందని, చికిత్సకు కావాల్సిన డబ్బు కోసమే తనతల్లి కష్టపడుతోందని తెలిపాడు. కలెక్టర్ నాగలక్ష్మి స్పందించి జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించారు.
short by
srikrishna /
11:30 am on
01 Jul