తిరుపతిలో ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మమత అనే ఓ యువతి పెళ్లి బట్టల్లో హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం 6 గంటలకు పెళ్లి చేసుకున్న సదరు యువతి, నేరుగా అవే బట్టలతో, తలపై జీలకర్ర బెల్లంతో తిరుపతిలోని పద్మావతి డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. చెకింగ్ అనంతరం ఆమె పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
short by
Srinu Muntha /
03:03 pm on
23 Feb