దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ మృతదేహంపై ఉన్న బంగారు నగలను ఆసుపత్రి సిబ్బంది చోరీ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ, కోలుకోలేక మృతి చెందింది. చనిపోయాక ఆమె చెవిపోగులు, గొలుసు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో CCTV దృశ్యాలు పరిశీలించగా చోరీ విషయం తెలిసింది. సదరు మహిళా సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించారు.
short by
Devender Dapa /
09:39 pm on
01 Dec