ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లోపల, దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (GHMC)లో విలీనం చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికోసం GHMC చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేయనుంది. విలీన ప్రక్రియ ముగిశాక 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ & 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.
short by
srikrishna /
01:52 pm on
26 Nov