దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్‌కు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమైనట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. గిల్ గైర్హాజరీలో రిషభ్ పంత్.. భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఇక గిల్ ప్లేసులో సాయి సుదర్శన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా గిల్ మెడకు గాయమైంది. అదే రోజు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. నవంబర్ 22 నుంచి రెండో టెస్టు జరగనుంది.
short by
Devender Dapa /
10:43 pm on
19 Nov