ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై నటుడు నాగార్జున మాట్లాడుతూ, ''పైరసీ సినిమాలను ఉచితంగా చూపించడం అనేది బిగ్ ట్రాప్. దీనివల్ల వ్యక్తిగత సమాచారం మోసగాళ్లకు చేరొచ్చు,'' అని అన్నారు. సైబర్ నేరగాళ్లు 6 నెలల క్రితం తన కుటుంబంలోనూ ఒకరిని డిజిటల్ అరెస్ట్ పేరిట 2 రోజులు నిర్బంధించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్లు క్షణంలో తప్పించుకున్నారని, ట్రేస్ చేయడమూ కుదరలేదని చెప్పారు.
short by
srikrishna /
06:53 pm on
17 Nov