సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై అల్లు అర్జున్ స్పందించారు. “నా క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. నాపై చేసినవన్నీ నిరాధారణ ఆరోపణలు. నేను ర్యాలీ చేయలేదు. పోలీసులు చెప్పాకే కారు నుంచి బయటకు వచ్చి చేతులు ఊపా. మహిళ చనిపోయిందనే విషయం నాకు మరుసటి రోజు వరకు తెలియదు. లీగల్ టీమ్ వద్దని చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లలేదు,” అని అల్లు అర్జున్ అన్నారు.
short by
Devender Dapa /
09:13 pm on
21 Dec