హిందూత్వమే తన శ్వాస అని, నోటి నుంచి ఆ మాట ఆగిపోతే తన శ్వాస ఆగిపోయినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం అన్నారు. గత GHMC ఎన్నికల్లో హిందూత్వవాదం వల్లే 48 సీట్లు గెలిచామన్నారు. పీఎం నరేంద్ర మోదీ అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుంటే, ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటు వేయడం లేదన్నారు. తాను హిందూత్వ నినాదంతో గడపగడపకూ తిరుగుతూ భవిష్యత్‌లో తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.
short by
srikrishna /
08:22 am on
20 Nov