ఈ ఏడాది నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17 వరకు (83 రోజులు) శుక్ర మౌఢ్యమి ఉంటుంది. దీన్ని ‘మూఢమి’ అని కూడా అంటారు. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో పెళ్లిచూపులు, వివాహం, గృహప్రవేశం, వాహనం కొనడం, పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయడం నిషిద్ధం.
short by
srikrishna /
09:03 am on
26 Nov