గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ 3లో గల లేడీస్ హాస్టల్‌లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిలు రెండో అంతస్తులో చిక్కుకుపోగా, స్థానికులు నిచ్చెన సాయంతో వారిని రక్షించారు. అయితే, ఓ బాలిక కిందకు దిగుతూ బాల్కనీ నుంచి జారిపడిపోయింది. ఆమెకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. ఏసీ పేలి హాస్టల్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
short by
Srinu /
08:52 pm on
28 Mar