నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము పోలీసుల కస్టడీకి విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతించింది. దీంతో జోగి రమేశ్, జోగి రామును 4 రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 26 ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ18, ఏ19గా ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
short by
Devender Dapa /
10:32 pm on
25 Nov