ప్రముఖ నటుడు రవితేజ తండ్రి 90 ఏళ్ల రాజగోపాల్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్‌కు ముగ్గురు కుమారులు కాగా, వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు.
short by
srikrishna /
07:48 am on
16 Jul