For the best experience use Mini app app on your smartphone
ఈ సంవత్సరంలోనే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన సూపర్‌మూన్ బుధవారం (నవంబర్ 5) రాత్రి ఆకాశంలో కనిపిస్తుంది. దీనిని బీవర్ మూన్ అని కూడా పిలుస్తారు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. నాసా ప్రకారం, చంద్రుడు ఈ సమయాల్లో మైక్రో మూన్ కంటే దాదాపు 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇది భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.49 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
short by srikrishna / 07:21 pm on 04 Nov
For the best experience use inshorts app on your smartphone