ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బెంగళూరుకు చెందిన సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌కి డైరెక్టర్‌గా ఉన్న ఉతప్ప, ఆ సంస్థ ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్‌ను కట్ చేసినప్పటికీ వాటిని సంబంధిత ఖాతాల్లో జమ చేయలేదు. దాదాపు రూ.23 లక్షలను ఆయన ఉద్యోగుల ఖాతాలో జమచేయలేదని తేలడంతో పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి ఈ వారెంట్ జారీ చేశారు.
short by
Sri Krishna /
12:58 pm on
21 Dec