పాకిస్థాన్‌లో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలు తెలిపాయి. అయితే శనివారం అంటే మే 10వ తేదీన కూడా పాకిస్థాన్‌లో 5.7, 4.0 తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించడం గమనార్హం. పాకిస్థాన్‌లో 3 రోజుల వ్యవధిలో 3 భూకంపాలు నమోదు కావడంపై ‘X’ వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘అణు పరీక్షలు చేయడంతోనే ఇలా జరుగుతోందా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై నిపుణులు, అధికారులు స్పందించలేదు.
short by
Devender Dapa /
06:12 pm on
12 May