For the best experience use Mini app app on your smartphone
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న పారామిలిటరీ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయంపై సోమవారం ముష్కరులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ కాంప్లెక్స్‌పై ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు కూడా దాడికి దిగినట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు కమాండోలతో పాటు దాడికి పాల్పడిన వారిలోని ముగ్గురు మరణించారని నివేదికలు తెలిపాయి. ఈ కార్యాలయం వద్ద పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని పేర్కొంటూ స్థానికులు వీడియోలు షేర్‌ చేశారు.
short by srikrishna / 10:25 am on 24 Nov
For the best experience use inshorts app on your smartphone