చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రికవరీ మేళాలో 1183 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. 2022 నుంచి మొత్తం 11,378 ఫోన్లు రికవరీ చేశామని, వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
short by
Bikshapathi Macherla /
11:56 pm on
28 Feb