తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
short by
srikrishna /
12:16 pm on
28 Nov