పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో తల్లీ కొడుకులు భారత వైమానిక దళానికి చెందిన భూమిని అమ్మేసిన కేసు వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు, రెవెన్యూ శాఖ అధికారుల సహాయంతో వారిద్దరూ 1997లో ఈ భూమిని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 28 ఏళ్ల అనంతరం దీనిని గుర్తించిన అధికారులు, నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పంజాబ్, హర్యానా హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
short by
/
11:16 am on
01 Jul