భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
short by
Devender Dapa /
11:55 am on
22 Nov