వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
short by
Sri Krishna /
01:33 pm on
21 Dec