For the best experience use Mini app app on your smartphone
మహారాష్ట్రలోని పుణెలో టైర్‌ పగిలినా ఆపకుండా మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారు ఓ పక్కకు వంగిపోయినా.. డ్రైవర్ మాత్రం ఆపలేదు. ఇది గమనించిన ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోడ్డుపై చెక్‌పాయింట్ ఏర్పాటు చేసి పోలీసులు కారును అడ్డుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
short by / 12:41 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone