For the best experience use Mini app app on your smartphone
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్షిక జీతం $140,000 (రూ.1.2 కోట్లకు పైగా) ఉంది. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం, ఆయన ఆస్తులలో 828 చ.అడుగుల అపార్ట్‌మెంట్, 3 కార్లు ఉన్నాయి. తనకు $7,12,000 సేవింగ్స్‌ ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు. అయితే, పుతిన్‌ $200 బిలియన్ (సుమారు రూ.18 లక్షల కోట్లకు పైగా) విలువైన నికర ఆస్తులు కలిగి ఉండొచ్చని అమెరికాకు చెందిన బిల్ బ్రౌడర్ అనే ఫైనాన్షియర్ గతంలో చెప్పారు.
short by srikrishna / 04:33 pm on 05 Dec
For the best experience use inshorts app on your smartphone