ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేతగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్‌లో దబాంగ్ ఢిల్లీ 31-28 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించింది. 12 సీజన్లలో దబాంగ్ ఢిల్లీ ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌లో ఢిల్లీ తొలిసారి టైటిల్ సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో పుణేరి పల్టాన్ విజేతగా నిలిచింది.
short by
Devender Dapa /
10:16 pm on
31 Oct