For the best experience use Mini app app on your smartphone
ఇత్తడి, రాగి పాత్రలలో పెరుగును ఉంచితే విషపూరితంగా మారవచ్చని నిపుణులు తెలిపారు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌ ఈ లోహ పాత్రలతో రసాయన చర్య జరిపి, జీర్ణం కాని విషపూరిత లవణాలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ సమ్మేళనాలు శరీరంలోకి ప్రవేశిస్తే కడుపునొప్పి, వాంతులు, వికారం, తలనొప్పితో పాటు కొన్ని సందర్భాల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలగవచ్చు. గాజు, సిరామిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలలో పెరుగును నిల్వ చేయడం మంచిది.
short by srikrishna / 07:29 am on 16 Apr
For the best experience use inshorts app on your smartphone