తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని, ఇలాంటి అసత్య ప్రచారాన్ని BRS పార్టీ కార్యకర్తలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నానని, పార్టీకి నష్టం కలిగే పనులు చేయనని తెలిపారు. సదరు యూట్యూబ్ ఛానల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
short by
/
02:43 pm on
12 Mar