మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనాథ్ ప్రేమ పేరుతో వేధించడంతో సాయిస్నేహిత అనే 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉరేసుకున్న ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. అయితే యువతి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలు రావడంతో శ్రీనాథ్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది.
short by
Bikshapathi Macherla /
09:58 pm on
03 Dec