తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాలో 27 ఏళ్ల లారీడ్రైవర్ విజయ్ హత్య కేసులో అతడి భార్య షర్మిల, ఆమె తల్లి ఫాతిమా అరెస్టయ్యారు. షర్మిల తన ప్రియుడితో కలిసి చేసిన రీల్స్‌ను విజయ్ చూసి ప్రశ్నించగా వారి మధ్య వాగ్వివాదం జరిగిందని, ఆ సమయంలో షర్మిల కర్రతో తలపై కొట్టడంతో అతడు చనిపోయాడని తేలింది. ఆమె తన తల్లితో కలిసి దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ జంట 5ఏళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
short by
srikrishna /
12:54 pm on
21 Nov