For the best experience use Mini app app on your smartphone
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో స్కూల్‌ బస్సు కిందపడి ఎల్‌కేజీ చదివే 4 ఏళ్ల జస్మిత మృతి చెందింది. తొరగల్లు గ్రామానికి చెందిన ఆ చిన్నారి గురువారం అదే బస్సులో పాఠశాలకు చేరుకుంది. తర్వాత బస్సును డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా దాని కింద పడింది. తీవ్ర గాయాలపాలైన బాలికను పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధరించారు.
short by srikrishna / 12:03 pm on 04 Sep
For the best experience use inshorts app on your smartphone