For the best experience use Mini app app on your smartphone
డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు తెలంగాణలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ సెప్టెంబర్‌లో షెడ్యూల్‌ విడుదల చేయగా, వాటి అమలుకు కోర్టు నిరాకరించింది. దీంతో అవి వాయిదా పడ్డాయి. అయితే, ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం.
short by Srinu / 07:01 pm on 17 Nov
For the best experience use inshorts app on your smartphone