For the best experience use Mini app app on your smartphone
చిత్తాపూర్‌ - సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోన్న చిత్తాపూర్ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా వస్తోందని హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ధర్నా చేశారు. ప్రతిరోజు ఉ.7.30కి రావాల్సిన రైలు 3-4 గంటలు ఆలస్యంగా వస్తోందని, దీంతో సకాలంలో ఆఫీస్‌లకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. కచ్చితమైన సమయవేళలు పాటించాలని డిమాండ్ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న తర్వాత రైలును అడ్డుకొని పట్టాలపై ఆందోళనకు దిగారు.
short by Devender Dapa / 11:21 pm on 21 Jan
For the best experience use inshorts app on your smartphone